
ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..తాజాగా కెజిఎఫ్ 2 మూవీ ఫై ప్రశంసల జల్లు కురిపించారు. యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన కెజియఫ్ 2 సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకొని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. యశ్ యాక్షన్ .. ప్రశాంత్ నీల్ టేకింగ్, ఆసక్తిని రేకెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , భారీ తారాగణం ఇవ్వన్నీ కూడా సినిమా విజయంలో భాగమయ్యాయి. ఇక ఈ మూవీ ఫై ఇప్పటికే అనేక మంది సినీ స్టార్స్ తమ స్పందనను తెలియజేయగా, తాజాగా రామ్ చరణ్ తో పాటు ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.
కేజీఎఫ్2′ విజయం సాధించినందుకు ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్, టీం అందరికి శుభాకాంక్షలు. యష్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు. అతని స్క్రీన్ ప్రజెన్స్ అభినందనీయం. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావురమేష్ అద్భుతంగా నటించారు. శ్రీనిధి శెట్టి, ఈశ్వరీరావు, అర్చనజీయెస్, మాళవికలకు శుభాకాంక్షలు. రవిబస్రూర్ సంగీతం అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు నా అభినందనలు’ అంటూ ట్విట్టర్లో రామ్‌చరణ్ చిత్ర బృందాన్ని ప్రశంసించాడు. అలాగే ప్రభాస్ కూడా సినిమా చాల బాగుందని అభినందనలు తెలిపారు.