Homeటాప్ స్టోరీస్చిన్మయి కంటే ఒక మెట్టు ఎక్కిన మెగా కోడలు

చిన్మయి కంటే ఒక మెట్టు ఎక్కిన మెగా కోడలు

చిన్మయి కంటే ఒక మెట్టు ఎక్కిన మెగా కోడలు
చిన్మయి కంటే ఒక మెట్టు ఎక్కిన మెగా కోడలు

మాధ్యమాల్లో లేక సినిమాలలో ఆడవారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే ‘చిన్మయి శ్రీపాద’ ట్విట్టర్ నుండి ఒక ట్వీట్ వచ్చేస్తుంది క్షణాల్లో. అందుకే ఆమెని ‘ఫెమినిస్ట్’ అంటారు. ఏదైనా సంఘటన గురించి చిన్మయి ప్రశ్నిస్తే కొంతమంది ఆమెకి మద్దతు తెలిపితే ఎక్కువ మంది ఆమెను వ్యతేరేకిస్తారు. అందుకే ఆమె బ్లాక్ లిస్ట్ పెద్దది. ట్విట్టర్ లో ఎవరన్నా ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఆమె ట్వీట్ కి రిప్లై ఇస్తే వారి పేరు బ్లాక్ లిస్ట్ లోకి చేరిపోతుంది.

ఒకవేళ ఇంకొక సంఘటన ఏదైనా తీసుకోండి అది మన సినిమా ప్రముఖులకు కానీ మన అనుకునే తెలుగు సినిమాకి గౌరవం తగ్గితే చిన్మయి ట్వీట్ చేసిందో లేదో కానీ అసలు ఆమెకి సంబంధం ఉన్నా లేకున్నా ఒక ట్వీట్ అయితే పెట్టాల్సింది కదా. సరే ఇక చిన్మయి విషయం వదిలేస్తే మనకి ఇక్కడ మాట్లాడుకోవడానికి మనకి జరిగిన అవమానం గురించి మెగా కోడలు ‘రామ్ చరణ్‘ భార్య అయిన ‘ఉపాసన కొణిదెల’ గారు మన తెలుగు సినిమా ప్రముఖుల గురించి తెలుగు సినిమా వైభవాల గురించి మన ప్రధాని మోడీ గారితో ఏ మాత్రం వణుకు లేకుండా తన అభిప్రాయాన్ని అడిగి కడిగేసింది.

- Advertisement -

మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాత్మ గాంధీ గారి 150 వ జన్మదిన కార్యక్రమాలని తన ఇంట్లో అట్టహాసంగా జరిపించారు. ఇందులో భారతీయ చిత్ర ప్రముఖులకు ప్రత్యేక విందు భోజనాన్ని ఏర్పాటు చేసారు. ఈ విందుకి మన దక్షిణాది సినిమా ప్రముఖులకు ఎవ్వరికీ ఆహ్వానం రాలేదు. అదే బాలీవుడ్ నుండి చిన్న పాటి నటి నటులకి కూడా ఆహ్వానం అందింది. మన తెలుగు సినిమా వారి ద్వారా ‘దిల్ రాజు’ గారికి ఇంకా ఇద్దరికీ ఆహ్వానం అందింది. దిల్ రాజు గారు కూడా మన వారు ఎవ్వరు రాలేదని తెలుసుకొని అక్కడ ఎక్కువ సమయం కేటాయించకుండా వెంటనే తిరిగి వచ్చేసారు. దిల్ రాజు గారికి అక్కడికి వెళ్ళేదాకా ఏమి తెలియదు. అక్కడికి వెళ్లిన తర్వాత మన వారు ఎవరు లేకపోవడంతో మొకం చాటేసుకొని ఒక ఫోటో దిగి వచ్చేసారు.

ఇక నరేద్ర మోడీ గారితో బాలీవుడ్ ప్రముఖులు ఫోటోలు దిగి పలు మాధ్యమాల్లో పెట్టేసరికి అందరూ చూసారు కానీ ఎవ్వరు మా తెలుగు సినిమా వారిని పిలవలేదు అని కారణం అడగలేదు. ఇక ఓపిక నశించిన ఉపాసన కొణిదెల గారు తన ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో నరేంద్ర మోడీ గారిని టాగ్ చేస్తూ “ప్రముఖులు పెద్దలు అయిన నరేద్ర మోడీ గారికి నమస్కరిస్తూ…. ద‌క్షిణాది ప్రజలందరికి మీరంటే ఎంతో గౌర‌వం మీ పై గౌరవం, ప్రేమ అందరికి ఎక్కువే. ప్రధానిగా మీరు మన భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకి ఎగరవెయ్యడం  ప‌ట్ల మేం గ‌ర్విస్తున్నాం. మీరు గొప్ప వ్యక్తుల‌ను వారి జన్మదిన కార్యక్రమాల‌కు కేవ‌లం హిందీ న‌టీన‌టులకు మాత్రమే ఆహ్వానం పంపి ప‌రిమితం చేశారు మిగిలిన సినీప్రముఖులు ఆహ్వానం పంపలేదు. ద‌క్షిణాది న‌టీన‌టుల‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయం మీద చాలా బాధ‌తో దక్షిణాది వారికి జరిగిన అవమానాన్ని చూడలేక నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను” అని ట్వీట్ చేసారు.

ఉపాసన ట్వీట్ కి ఇప్పుడు మాధ్యమాల్లో బాగా ఆదరణ లభిస్తుంది. ఒకపక్క కొంతమంది అయితే చిన్మయి శ్రీపాద కంటే మెగా కోడలు ఇలా అడగటం వలన ఆమె స్థానం నంబర్ 1  కి చేరిపోయింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫెమినిస్ట్ అని ఒక పేరు పెట్టేసుకొని అనవసరమైన విషయాలని జనాల మీద రుద్దడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All