Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్రామ్‌చ‌ర‌ణ్ మేక‌ప్‌కు రెండు గంట‌లా?

రామ్‌చ‌ర‌ణ్ మేక‌ప్‌కు రెండు గంట‌లా?

రామ్‌చ‌ర‌ణ్ మేక‌ప్‌కు రెండు గంట‌లా?
రామ్‌చ‌ర‌ణ్ మేక‌ప్‌కు రెండు గంట‌లా?

ఈ ఏడాది సీనీ ప్రియులు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ముందు వ‌రుసలో నిలిచిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ న‌టుల‌తో పాటు హాలీవుడ్ న‌టులు కూడా ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌‌టిస్తున్నారు.

- Advertisement -

ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు ప‌ది భార‌తీయ ప్ర‌ధాన భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.  ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇదిలావుండగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో మేకప్ తొలగించడానికి రెండు గంటలు పడుతుందని చరణ్ ఇటీవల వెల్లడించారు.

మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లో జరిగిన వార్షిక పోలీసు స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి చరణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్ మాట్లాడుతూ ` మేకప్ వేసుకోవడానికి తనకు గంటన్నర సమయం పడుతుందని, దాన్ని తొలగించడానికి మ‌రో రెండు గంట‌ల సమయం ప‌డుతోంద‌ని పేర్కొన్నారు. తన పాత్ర పీరియడ్ క్యారెక్టర్ కావడంతో మేకప్‌కి చాలా సమయం పడుతుందని చ‌ర‌ణ్ తెలిపారు.

`ఆర్‌ఆర్‌ఆర్` చిత్రీక‌ర‌ణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గన్,  స‌ముద్ర‌ఖ‌ని, రేస్టీవెన్‌స‌న్‌ ఈ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts