Homeటాప్ స్టోరీస్రామ్ చరణ్, శంకర్ సినిమా ముహూర్తం వాయిదా

రామ్ చరణ్, శంకర్ సినిమా ముహూర్తం వాయిదా

రామ్ చరణ్, శంకర్ సినిమా ముహూర్తం వాయిదా
రామ్ చరణ్, శంకర్ సినిమా ముహూర్తం వాయిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ తో కలిసి సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను ప్రకటించి శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులను చేపట్టారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న అధికారికంగా లాంచ్ చేయాలని భావించారు కానీ తాజా సమాచారం ప్రకారం ఆ ముహుర్తము వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఆర్ ఆర్ ఆర్ ప్యాచ్ వర్క్ కోసం చరణ్ డేట్స్ కావాలి రాజమౌళికి. దాదాపు 10 రోజుల పాటు ఆ ప్యాచ్ వర్క్ సీన్స్ ను షూట్ చేస్తారు. దాని తర్వాత ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శంకర్ సినిమా ముహుర్తాన్ని సెప్టెంబర్ ఎండ్ కు వాయిదా వేయాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడు.

- Advertisement -

ఈ ప్రాజెక్ట్ ను దిల్ రాజు ప్యాన్ ఇండియా లెవెల్లో నిర్మించనున్నాడు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందించనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All