Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్: రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య కళ్ళు చెదిరే ఫైట్

ఆర్ ఆర్ ఆర్: రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య కళ్ళు చెదిరే ఫైట్

ఆర్ ఆర్ ఆర్: రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య కళ్ళు చెదిరే ఫైట్
ఆర్ ఆర్ ఆర్: రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య కళ్ళు చెదిరే ఫైట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడు. అలాగే ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తాడు. ఈ ఇద్దరి పాత్రల వ్యక్తిత్వం పూర్తి భిన్నంగా ఉంటాయన్న సంకేతాలను టీమ్ మొదటి నుండి ఇస్తోంది.

ఒకరి ఫైర్ తోనూ మరొకరిని వాటర్ తోనూ పోలుస్తున్నారు. ఈ ఇద్దరి జీవన ప్రయాణానికి ఫిక్షన్ ను జోడించి రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వీరిద్దరి పాత్రల మధ్య సంఘర్షణ హైలైట్ గా ఉంటుందిట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వీరి మధ్యన ఫైట్ సీక్వెన్స్ ను ఓ రేంజ్ లో చిత్రీకరించాడట రాజమౌళి. నెవెర్ బిఫోర్ తరహాలో ఈ ఎపిసోడ్ ఉంటుందిట. కళ్ళు చెదిరేలా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేసాడట.

- Advertisement -

డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన దోస్తీ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All