
ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజులుగా అమృత్‌సర్‌లో జరుగుతోంది.
షూటింగ్ గ్యాప్‌లో చరణ్ అమృతసర్ సమీపంలోని ఖాసా సరిహద్దుకు చరణ్ వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్‌ఎఫ్ జవాన్లను కలిసి.. కాసేపు వారితో ముచ్చటించారు. అంతే కాదు వారితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- Advertisement -