Homeగాసిప్స్తన 16వ చిత్రాన్ని కూడా సైన్ చేసిన రామ్ చరణ్

తన 16వ చిత్రాన్ని కూడా సైన్ చేసిన రామ్ చరణ్

తన 16వ చిత్రాన్ని కూడా సైన్ చేసిన రామ్ చరణ్
తన 16వ చిత్రాన్ని కూడా సైన్ చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేసాడు. దాదాపు మూడేళ్ళ తర్వాత ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అయ్యాడు చరణ్. ఇది తనకు 14వ చిత్రం. దీని తర్వాత శంకర్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం విదితమే. ఈ చిత్రం సెప్టెంబర్ 8న రెగ్యులర్ షూటింగ్ మొదలై వచ్చే ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశముంది.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇప్పుడు తన 16వ చిత్రాన్ని కూడా లాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయిన చరణ్ మరో ఆలోచన లేకుండా ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేసాడట. ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తారు.

- Advertisement -

వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అని ఎప్పటినుండో వార్తలు వస్తుండగా పలు సిట్టింగ్స్ తర్వాత సంతృప్తి పడడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గౌతమ్ తిన్ననూరి జెర్సీ హిందీ రీమేక్ షూటింగ్ ను పూర్తి చేసి విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All