HomeVideosఅనుభవించు రాజా: పల్లెటూరి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ప్లాన్ చేసారు!

అనుభవించు రాజా: పల్లెటూరి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ప్లాన్ చేసారు!

అనుభవించు రాజా: పల్లెటూరి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ప్లాన్ చేసారు!
అనుభవించు రాజా: పల్లెటూరి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ప్లాన్ చేసారు!

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తను నటించిన రీసెంట్ సినిమాలు అన్నీ కూడా నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చిత్రం చేయడానికి ఫిక్స్ అయ్యాడు రాజ్ తరుణ్. తనతో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తీసిన శ్రీనివాస్ గవిరెడ్డితో అనుభవించు రాజా అనే పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చిత్రం చేస్తున్నాడు.

పూర్తిగా కోనసీమ స్లాంగ్ లో రాజ్ తరుణ్ చేస్తోన్న ఈ చిత్రం టీజర్ ను ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసారు. టైటిల్ కు తగ్గట్లుగానే రాజ్ తరుణ్ ఇందులో జల్సా రాయుడి పాత్రను పోషిస్తున్నాడు. కోళ్ల పందాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అర్ధమవుతోంది. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ కోనసీమ స్లాంగ్ ఎప్పటిలానే అదిరింది. మొత్తానికి రాజ్ తరుణ్ ఈ టీజర్ తో పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించ గలిగాడు.

- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీత అందిస్తున్నాడు. కశీష్ ఖాన్ ఈ సినెమాలో హీరోయిన్ గా చేస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, ఆడుకళం నరేన్, అజయ్, రవి కృష్ణ, సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All