
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఎంజాయ్ ని శంకర్ సినిమాలో చూపించబోతున్నాడు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. మరో రెండు నెలల్లో సినిమా ను పూర్తి చేయాలనీ చరణ్ ఫిక్స్ అయ్యాడు. గత కొద్దీ రోజులుగా శంకర్ సినిమా షూటింగ్ ను ఆపేసి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లలో బిజీ బిజీ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుదల కావడం , బ్లాక్ బస్టర్ విజయం కావడం , భారీ వసూళ్లు రాబడుతుండడం తో శంకర్ సినిమా ఫై ఫోకస్ పెట్టాడట.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా కీలక పాత్రలో అంజలి కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ సినిమా లో సునీల్ శ్రీకాంత్ ఇంకా ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.