
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా చరణ్ ..ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఆర్ఆర్ఆర్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రస్తుతం హౌస్ ఫుల్ తో రన్ అవుతున్న నేపథ్యంలో చిత్రానికి పనిచేసిన పలు డిపార్ట్మెంట్స్ కు సంబదించిన 35 మందికి గిఫ్ట్ లు ఇచ్చాడు చరణ్.
సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించిన చరణ్.. వారితో కాసేపు ముచ్చటించి అనంతరం వారందరికీ ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడడంతో పాటుగా ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని, ఈ సందర్భంగా రామ్ చరణ్ అన్నారు. చరణ్ నుండి పిలుపు రావడమే అనుకుంటే వారికీ గిఫ్ట్ లు ఇవ్వడంతో అంత సంతోషంలో మునిగిపోయారు.