
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మాములుగా అయితే అక్టోబర్ 13న విడుదలవ్వాలి కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ కచ్చితంగా మారే అవకాశముంది.
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రామ్ చరణ్, ఆ తర్వాత శంకర్ తో ప్యాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేసాడు రామ్ చరణ్. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. శంకర్ కు లైకా ప్రొడక్షన్స్ తో ఉన్న లీగల్ చిక్కులు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈలోగా రామ్ చరణ్ కు వేరే దర్శకుల నుండి కథలు వినిపిస్తాం అంటూ ఫోన్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ కథలు వినడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు కానీ కమిట్మెంట్ మాత్రం ఇవ్వట్లేదు. తన మార్కెట్ ను మరింత విస్తరించే చిత్రాన్నే చేయాలనుకుంటున్నాడు చరణ్.