Homeటాప్ స్టోరీస్2023 సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ - శంకర్ చిత్రం

2023 సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ – శంకర్ చిత్రం

2023 సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ - శంకర్ చిత్రం
2023 సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ – శంకర్ చిత్రం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. జులై లోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకావాల్సింది కానీ శంకర్ కు ఇండియన్ 2 విషయంలో ఉన్న లీగల్ సమస్యల కారణంగా జాప్యమైంది. అయితే ఇప్పుడు సమస్యలు అన్నీ సమసిపోయినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలే లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, శంకర్ ను కలిసారుట.

ఇద్దరూ కలిసి డిన్నర్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ 2 ను రామ్ చరణ్ చిత్రం తర్వాత పూర్తి చేస్తాడని సమాచారం. ఇక చరణ్ సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ 8 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 10 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తానని దిల్ రాజుకు శంకర్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

తెలుగు, తమిళ్ తో పాటు మరో మూడు భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు, తమిళ్ లో సమాంతరంగా షూటింగ్ చేస్తారు. కియారా అద్వానీ హీరోయిన్ గా చేయనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All