
ఆర్ఆర్ఆర్ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటించి ప్రేక్షకులను , అభిమానులను మెప్పించారు. కానీ వచ్చే మార్చి లో మాత్రం పోటీపడబోతున్నారు. ఏంటి..అని అనుకుంటున్నారా..అవును వీరిద్దరూ నటిస్తున్న చిత్రాలు మార్చి నెలలో ఒకేసారి బరిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం చరణ్..శంకర్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఇక ఎన్టీఆర్..కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ చిత్రం చేయబోతున్నాడు. జూన్ నెల నుండి ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. దీనిని కూడా పాన్ ఇండియా తరహా లో తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ మూవీ లో అలియా భట్ ను హీరోయిన్ గా ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని కూడా మార్చి నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వార్తే నిజమైతే మెగా నందమూరి హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరగడం ఖాయం.