
తమిళంలో సూపర్ డూపర్ సెన్సేషన్ గా నిలిచిన రాక్షసన్ చిత్రం తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రూపొందబోతోంది. అక్షయ్ కుమార్ హీరోగా రాక్షసుడు సినిమా రీమేక్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ కు వెళుతోంది. అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ఎంపికైనట్లు సమాచారం. లండన్ లో ఈ వీకెండ్ నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్ తెరకెక్కుతుంది.
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కు గుర్తింపు పొందిన రాక్షసుడు మొదటి నుండి చివరి దాకా టెన్షన్ పెట్టిస్తుంది. మరి ఈ చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరస అవకాశాలను అందుకుంటోంది. దాదాపుగా అరడజనకు పైగా చిత్రాలతో బాలీవుడ్ లో సూపర్ బిజీగా ఉంది ఈ భామ.