
వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ రకుల్ ప్రీతీ సింగ్ ..ప్రస్తుతం తన ప్రియుడు జాకీ భగ్నాని తో మాల్దీవుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. తెలుగు లో వరుసగా అగ్ర హీరోల సరసన జోడి కట్టిన ఈ భామ..ప్రస్తుతం బాలీవుడ్ ఫై ఫోకస్ చేసి వరుస సినిమాలు చేస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ వస్తుంది.
ఇదిలా ఉంటె గత ఏడాది జాకీ భగ్నాని అనే హిందీ నిర్మాత కం నటుడిని ప్రేమిస్తున్నాను తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. మాల్దీవుల్లో ప్రస్తుతం ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తాలూకా ఎంజాయ్ ని ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటూ వస్తుంది రకుల్. ముందుగా ఎద అందాలను చూపిస్తూ ఉన్న ఒక ఫోటో షేర్ చేసిన ఆమె ఇప్పుడు తాజాగా బ్యాక్ నుంచి తన అందాన్ని చూపిస్తూ ఒక ఫోటో వదిలింది. ఒక రకంగా తన అందాలను ఆరబోస్తూ రెచ్చగొట్టే విధంగా రకుల్ మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు.