
సెలబ్రిటీలకు మాల్దీవ్స్ ఈ మధ్య కాలంలో హాట్ స్పాట్‌గా మారింది. గత ఏడు నెలలుగా కరోనా పాండమిక్ కారణంగా ఇంటి పట్టునే వుంటూ వస్తున్న సెలబ్రిటీలు అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ప్రారంభం కావడంతో నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఛిల్ అవడం మొదలుపెట్టారు. భయం భయంగా గడిపిన స్టార్స్ అంతా రిలాక్స్ కోసం మాల్దీవుల బాట పడుతున్నారు.
హనీమూన్ స్పాట్‌గా కూడా మాల్దీవ్స్‌కి మంచి క్రేజ్ వుండటంతో ఇటీవల కాజల్ అగర్వాల్ హానీమూన్ కోసం మాల్దీవ్స్‌ని ఎంచుకున్న విషయం తెలిసిందే. తన చిరకాల ప్రియుడు, సోల్‌మేట్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న కాజల్ అతనితో కలిసి వెకేషన్‌కి వెళ్లడమే కాకుండా అండర్ వాటర్ రూమ్‌కి సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది.
తాజాగా వరుస బిజీ షెడ్యూల్.. టెన్షన్‌లతో హీటెక్కిన రకుల్ ప్రీత్‌సింగ్ తను కూల్ అవ్వడానికి మాల్దీవ్స్‌ని ఎంచుకుంది. అక్కడి దీవుల్లో బికినీ ధరించి ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ పరవశించిపోతోంది. ఇందుకు సంబంధించిన ఓ పిక్‌ని అభిమానులతో పంచుకుంది. దీనికి `సముద్రం వాసన, అహ్లదకరమైన ఆకాశాన్ని అనుభూతి చెందండి. మీ సోల్‌ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గ్రీన్ కలర్ బికినీలో తనని తాను మరిచిపోయి ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్న రకుల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.