
మూడేళ్ల విరామం తరువాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం `వకీల్ సాబ్`. స్టార్ ప్రొడ్యూసర్ 25 ఏళ్ల డ్రీమ్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ ని వినిపిస్తోంది. ఎక్కడ ఏ నోట విన్నా.. ఏ సెలబ్రిటీ నోట విన్నా ఒకటే మాట `వకీల్ సాబ్` పక్కా బ్లాక్ బస్టర్. పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ ఈ మూవీకి బ్రహ్మ రథం పడుతున్నారు.
ఇదిలావుంటే సగటు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీపై, ఇందులో నటించిన నటీనటులపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నందాగా కీలక పాత్రలో నటించిన విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ని ప్రత్యేకంగా అభినందించారు.
పవన్‌కల్యాణ్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌కి మరింత ఎనర్జీని యాడ్ చేసిన పాత్ర ప్రకాష్‌రాజ్‌ది. ఈ సందర్భంగా చిరు ఆయనని తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. `మీకు ప్రకాష్‌రాజ్ లాంటి కాలిబర్ వున్న నటుడు మీకు ఉన్నప్పుడు అతని తోటి కళాకారులను వారి గేమ్‌ను కూడా మెరుగుపరుస్తుంది. `వకీల్‌సాబ్`లో అతను అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. సినిమాలో తను పవన్ కళ్యాణ్ తో పోటాపోటీగా వుండే ధీటైన పాత్రని పోషించాడు. మీకు ప్రత్యేక అభినందనలు. కీప్ రాకింగ్ ప్రకాష్` అని ప్రకాష్‌రాజ్‌ని అభినందిస్తున్న ఫొటోని షేర్ చేశారు చిరు.