Homeటాప్ స్టోరీస్రాజు గారి గది 3 రివ్యూ

రాజు గారి గది 3 రివ్యూ

Raju Gari Gadhi 3 Movie Rreview in Telugu
Raju Gari Gadhi 3 Movie Rreview in Telugu

రివ్యూ : రాజు గారి గది 3
నటీనటులు :
అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, బ్రహ్మాజీ, హరితేజ తదితరులు
దర్శకత్వం : ఓంకార్
నిర్మాణం : ఓక్ ఎంటర్టైన్మెంట్స్
సంగీత దర్శకత్వం : షబీర్
సినిమాటోగ్రాఫర్ : ఛోటా కె నాయుడు
రిలీజ్ డేట్: 18th Oct, 2019
రేటింగ్ – 3/5 

ఓంకార్ తనకు అచొచ్చిన రాజు గారి గది సిరీస్ లో మూడో భాగాన్ని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం రాజు గారి గది 1 తరహాలో నవ్విస్తుందో లేక రాజు గారి గది 2 తరహాలో బోర్ కొట్టిస్తుందో రివ్యూలో చూద్దాం.

- Advertisement -

కథ :
అశ్విన్ (అశ్విన్ బాబు) ఒక ఆటో డ్రైవర్. తన వల్ల ఆ కాలనీలో వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు అదే కాలనీలో ఉండే మాయ (అవికా)కు ఎవరు ప్రపోజ్ చేస్తారో వాళ్ళు ఇబ్బందుల్లో పడుతుంటారు. వాళ్ళని ఆత్మ వేధిస్తుంటుంది. అందుకని ఆ కాలనీలో వాళ్ళందరూ బాగా ఆలోచించి తమకు ఇబ్బందిగా మారిన అశ్విన్ ను మాయకు ఆకర్షితుడు అయ్యేలా చేస్తారు. అశ్విన్ చేత మాయకు ప్రపోజ్ చేయిస్తారు. దాంతో అశ్విన్ కొన్ని విచిత్రమయిన పరిస్థితులను ఎదుర్కొంటాడు.

అసలు ఈ మాయ ఎవరు? ఆమెకు ఏమవుతుంది? ఎందుకని ఆమెకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు? మాయకు ప్రపోజ్ చేయడం వల్ల అశ్విన్ కు ఏమవుతుంది? మాయ మిస్టరీని అశ్విన్ సాల్వ్ చేయగలుగుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు :
అశ్విన్ ఈ సినిమాలో చాలా మెరుగ్గా కనిపిస్తాడు. తొలి రెండు సినిమాల్లో కంటే ఇందులో అశ్విన్ కు మెరుగైన పాత్ర దక్కింది. కామెడీ, డ్యాన్స్ లలో అశ్విన్ ఆకట్టుకుంటాడు. ఓంకార్ ముఖ్యంగా అశ్విన్ ను దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాను తీసాడు అనిపిస్తుంది. అవికాకు దక్కింది చిన్న పాత్రే అయినా కూడా ఆమె మెప్పిస్తుంది.

బ్రహ్మాజీ డాక్టర్ పాత్రలో చెలరేగిపోయాడు. అలీ తనకున్న కామెడీ అనుభవాన్ని ఈ సినిమాలో బాగా చూపించాడు. కొన్ని సీన్లలో తనే మెయిన్ అట్రాక్షన్ అయ్యాడు. అజయ్ ఘోష్ కూడా ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా అజయ్ ఘోష్, ఊర్వశి కాంబినేషన్ లో సీన్లు నవ్విస్తాయి. ధనరాజ్ మెప్పిస్తాడు. ప్రభాస్ శీను, గెటప్ శీను, హరితేజ కాలనీ వాసులుగా నవ్వులు పూయిస్తారు. మిగిలినవారంతా తమ పరిధి మేరకు నటించి సినిమాకు సహాయపడ్డారు.

సాంకేతిక వర్గం :
రాజు గారి గది 3 సాంకేతిక నిపుణుల విషయంలో ముందుగా చర్చించుకోవాల్సింది సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించే. ఈ రెండు విభాగాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. ఛోటా కె నాయుడు ఈ సినిమాకు సరికొత్త ఫీల్ ను తీసుకొచ్చాడు. ఆర్ట్ డైరెక్షన్ టీమ్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈ సినిమాలో వాడిన సెట్స్, ప్రాపర్టీస్ మెప్పిస్తాయి. సంగీతం సాధారణంగానే ఉన్నా, నేపధ్య సంగీతం మెప్పిస్తుంది. ఒక హారర్ కామెడీకి ఎటువంటి సంగీతం ఇవ్వాలో సరిగ్గా అలాగే కుదిరింది.

నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక రిచ్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడిగా ఓంకార్ సగం విజయం సాధించాడనే చెప్పాలి. హారర్ కామెడీ జోనర్ వరకూ న్యాయం చేసినా కథ విషయంలో పూర్తిగా చేతులెత్తేశాడు. అశ్విన్ కు ఉన్న టాలెంట్స్ అన్నీ చూపించుకోవడానికే ఈ సినిమా ఉపయోగపడింది.కథ విషయంలో ఫెయిల్ అయినా కానీ ఓంకార్ కామెడీతో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసాడు.

చివరిగా :
రాజు గారి గది 2 లో ఎంటర్టైన్మెంట్ తగ్గిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఓంకార్, రాజు గారి గది 3ను ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా సో సోగా, కేవలం కథలోకి వెళ్ళడానికి వాడుకున్న ఓంకార్, సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మాత్రం చెలరేగిపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో 15 నిమిషాల పాటు ఉండే బంగ్లా ఎపిసోడ్ రాజు గారి గది 3 గ్రాఫ్ నే మార్చేస్తుంది. పూర్తి హిలేరియస్ గా ఉన్న ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే ఇదే గ్రాఫ్ కంటిన్యూ చేసినట్లయితే రాజు గారి గది 3 రేంజ్ వేరుగా ఉండేది. కానీ క్లైమాక్స్ ను హడావుడిగా చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడే ఈ చిత్రం యావరేజ్ మార్కులతో గట్టెక్కిన ఫీలింగ్ కలుగుతుంది.

కథ లేకపోవడం, ఫస్ట్ హాఫ్ లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా లేకపోవడం, క్లైమాక్స్ ను హడావిడిగా ముగించడం రాజు గారి గది3 ప్రతికూలంగా నిలుస్తాయి. మరోవైపు సెకండ్ హాఫ్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

రాజు గారి గది 3 – టైమ్ పాస్ హారర్ కామెడీ  

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All