Homeటాప్ స్టోరీస్అసలు ఏముంది ఈ రాజు గారి గదిలో?

అసలు ఏముంది ఈ రాజు గారి గదిలో?

Raju Gari Gadhi 3
Raju Gari Gadhi 3

ఒక సినిమా హిట్ అయితే దానికి కొనసాగింపు గా ఇంకొక పార్ట్ ని రూపుదిద్దుతారు దర్శకులు. ఎందుకంటే మొదట పార్ట్ బాగుంటే సినిమాని ఇంకొక పార్ట్ తీసిన జనం చూస్తారు కాబట్టి అనే నమ్మకం…. ఒక్క బాహుబలి తప్ప అలాంటి ప్రయోగాలుగా వచ్చిన పార్ట్ 2 సినిమాలు మన తెలుగు సినిమా చరిత్రలో హిట్ అయ్యిన దాఖలాలు లేవు.

చూసుకుంటే సినిమాకి కొనసాగింపుగా రెండవ పార్ట్ అదే టైటిల్ తో వస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఒక నమ్మకం ఉంది తెలుగు సినిమాల మీద. ఆర్య-ఆర్య 2, కిక్-కిక్ 2, మన్మధుడు-మన్మధుడు 2, రాజు గారి గది- రాజు గారి గది 2……… ఇంకా చూసుకుంటే ఒక 10 నుంచి 20 సినిమాలు వాటి కొనసాగింపుగా వచ్చిన అదే టైటిల్ పార్ట్ 2 సినిమాలు గోరంగా విఫలం అయ్యాయి. వాటిని ఉదాహరగా అయిన తీసుకొని దర్శకులు నిర్మాతల డబ్బులు వృధా కానివ్వకుండా బాహుబలి హిట్ అయ్యింది కదా మన పార్ట్ 2 కూడా హిట్ అవుతుంది అని ఆలోచిస్తూ ముందు అడుగు వేస్తున్నారు.

- Advertisement -

బాహుబలి కథ చూసుకుంటే కథ, కథనం, దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంది. మరి ఒక సాధ సీదా అయిన కథ కి  కొనసాగింపు పార్ట్ 2 ఆడుతుందా? లేదా?  అని ముందే ఆలోచించడమే బెటర్. ఇప్పుడు దాకా చెప్పుకున్నవి పార్ట్ 2 సినిమాల గురించి. ఇప్పుడు మాట్లాడబోయేది ఏకంగా పార్ట్ 3 గురించి, ఆ సినిమా ఏంటంటే ఈ నెల 18 కి విడుదల కాబోతున్న ‘రాజు గారి గది 3‘ . మొదటి పార్ట్ సూపర్ హిట్ అయ్యింది. రెండవ పార్ట్ నాగార్జున, సమంత వారి వలన మొదటి వారం రోజులు మంచి టాక్ సంపాదించినా కూడా…. తెలుగు సినిమా రెండవ పార్ట్ విఫలం అనే సెంటిమెంట్ కి దెబ్బతినిపోయింది.

మరి ఓంకార్ గారు ఏమో ఈ పార్ట్ 3 మీద చాలా నమ్మకంగా ఉన్నారు. తమ్ముడు అశ్విన్ బాబు ని 3 పార్ట్ లలో హీరోగా పెట్టేసారు. సినిమా ఇంకో 4 రోజుల్లో విడుదల కాబోతుంది. ఇప్పటి వారికి తెలుగు సినిమాలు పార్ట్ 3 వరకు వచ్చిన దాఖలాలు లేవు… ఒక్క సూర్య అలాగే  రాఘవ లారెన్స్ నటించిన ‘సింగం’ మరియు ‘కాంచన’ పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా తమిళ నుండి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు.

ఇప్పుడు మొదటి తెలుగు సినిమాగా వస్తున్న పార్ట్ 3 ‘రాజు గారి గది’ సినిమా విజయం   అవుతుందా? లేక బోల్తా కొడుతుందా? అంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. అందరూ 18 వ తారీఖు మొదటి ఆట ని బట్టి చెప్పొచ్చు అనుకుంటున్నారు. విడుదల అయిన పాటలు, ట్రైలర్ కూడా ఒక మోస్తరు ఆడియన్స్ ని మాత్రమే రాబట్టుకుంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All