
సూపర్ స్టార్ రజినీకాంత్ మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు. రజినీకాంత్ నటించిన అన్నాత్తే రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని తెలుగు అండ్ తమిళ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ డీల్ లాక్ అయింది.
ఇక రజినీకాంత్ అన్నాత్తే టీజర్ ను దసరా సందర్భంగా లాంచ్ చేసారు. సాధారణంగా రజిని సినిమాల నుండి కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఈ టీజర్ లో ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు శివ మాస్ అంశాలను బాగా చొప్పించినట్లు అర్ధమవుతోంది. శివ సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరగా ఉంటాయి.
ఈ టీజర్ ను కూడా అదే కోవలో రూపొందించాడు. ఈ టీజర్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు రజినీ మ్యానరిజమ్స్. రజినీకాంత్ తనదైన స్టైల్ ను మరోసారి ఈ చిత్రం ద్వారా ప్రెజంట్ చేసాడు. ఇక డి. ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మేజర్ హైలైట్ గా నిలిచింది.
సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రజనీకాంత్ గత చిత్రాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాని నేపథ్యంలో రజినీకాంత్ నుండి భారీ హిట్ ను కోరుకుంటున్నారు ప్రేక్షకులు.
