Homeగాసిప్స్మరో కొత్త సినిమాను సైన్ చేసిన రజినీకాంత్

మరో కొత్త సినిమాను సైన్ చేసిన రజినీకాంత్

మరో కొత్త సినిమాను సైన్ చేసిన రజినీకాంత్
మరో కొత్త సినిమాను సైన్ చేసిన రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే అన్నాత్తే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళికి విడుదలైన ఈ చిత్రం డీసెంట్ గా పెర్ఫర్మ్ చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. మొత్తంగా అన్నాత్తే యావరేజ్ అనిపించుకోవడంతో రజినీకాంత్ అన్నాత్తే నిర్మాతలైన సన్ పిక్చర్స్ కు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అసలైతే వయసును దృష్టిలో పెట్టుకుని రజినీకాంత్ ఇక సినిమాలు చేయరేమోనని పుకార్లు వచ్చాయి కానీ అవన్నీ ఒట్టి రూమర్స్ అని తేలిపోయింది.

రజినీకాంత్ ఇకపై సినిమాలను కంటిన్యూ చేస్తాడట. తన తర్వాతి చిత్రం కూడా సన్ పిక్చర్స్ కు చేయనున్న నేపథ్యంలో దర్శకుడిగా పాండిరాజ్ ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాండిరాజ్ రీసెంట్ గా సూర్యతో ET చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఫిబ్రవరి 4, 2022న ఈ చిత్రం విడుదలవ్వనుంది.

- Advertisement -

ఇప్పటికే పాండిరాజ్, రజినీకాంత్ ను కలిసి ఒక లైన్ ను వినిపించినట్లు తెలుస్తోంది. కచ్చితంగా సినిమా చేస్తానని ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు సమాచారం. అలాగే అన్నాత్తే దర్శకుడు శివ వర్కింగ్ స్టయిల్ కూడా నచ్చడంతో తనకు మరో సినిమా చేసి పెడతానని రజినీ అన్నట్లు తెలుస్తోంది. వీటిపై క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి: 

శివ కథ చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదు – రజినీకాంత్

రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది: వైద్యులు

రెండుగా చీలిన రజినీకాంత్ అభిమానులు

రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All