
సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ నిరాశపరచడంతో ఇప్పుడు శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. అన్నాతై అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కాస్టింగ్ భారీగానే ఉంది. రజినీకాంత్ తో పాటు మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా కరోనా వైరస్ కారణంగా బ్రేకులు పడిన విషయం తెల్సిందే.
ఇక నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలుపెడదామని ప్రయత్నాలు జరుగుతుండగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఈ చిత్రాన్ని నవంబర్ లో షూట్ చేయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. సూపర్ స్టార్ వయసు రీత్యా ఇప్పుడున్న కరోనా కేసులు దృష్ట్యా అన్నాతై షూట్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు జనవరిలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.