Homeటాప్ స్టోరీస్3 రోజుల్లో వంద కోట్లు సాధించిన కాలా

3 రోజుల్లో వంద కోట్లు సాధించిన కాలా

kaala joins 100 crore clubసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కాలా ” చిత్రం మూడు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది . కాలా చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ రజనీకాంత్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి . అసలు రజనీకాంత్ చిత్రం మొదటి రోజునే వంద కోట్ల గ్రాస్ వసూల్ చేయాలి కానీ కబాలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు లేకుండా పోయాయి దాంతో మూడు రోజులకు గాను వంద కోట్లు వచ్చాయి .

కబాలి చిత్రానికి దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ కాలా చిత్రానికి దర్శకత్వం వహించాడు దాంతో కాలా పై పెద్దగా ఆశలు లేకుండా పోయాయి . అందుకే భారీ ఓపెనింగ్స్ కూడా సాధ్యం కాలేదు , ఇక ఓవర్ సీస్ లో అయితే మూడు రోజులకు వన్ మిలియన్ డాలర్లు దాటేసింది కామన్ గా అయితే కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల ని కొట్టేస్తాడు రజనీకాంత్ . వీకెండ్ కూడా ఈరోజు తో అయిపోతుంది కాబట్టి రేపటి నుండి రజనీకాంత్ చిత్రానికి కష్టాలు తప్పేలా లేవు . ముంబై స్లమ్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కిన కాలా చిత్రంలో రజనీ సరసన ఈశ్వరి రావు , బాలీవుడ్ హాట్ భామ హుమా ఖురేషి నటించారు . కీలక పాత్రలో నానా పటేకర్ నటించాడు . కాలా చిత్రం కూడా ప్లాప్ అవ్వడంతో రజనీకాంత్ అభిమానుల్లో నిరాశ నిస్పృహలు మొదలయ్యాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All