Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్సూపర్ స్టార్ భయపడ్డాడా ?

సూపర్ స్టార్ భయపడ్డాడా ?

Rajinikanth fans upset in election timeసూపర్ స్టార్ రజనీకాంత్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అలాగే తన పార్టీ తరుపున ఎవరినీ పోటీకి దింపడం లేదు . ఇక చర్చ కు తావులేకుండా మా లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే అని తేల్చి చెప్పేసాడు దాంతో రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు , అవమాన భారంతో రగిలిపోతూన్నారు . రాజకీయ పార్టీ అని పెట్టిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలి లేదంటే పొత్తు అయినా పెట్టుకోవాలి ఎవరికైనా మద్దతు అయినా ఇవ్వాలి కానీ రజనీకాంత్ మాత్రం ఇవేవి చేయకుండా పార్లమెంట్ కు పోటీ చేయడం లేదని ప్రకటించడం ఏంటి ? అని అభిమానులు షాక్ అవుతున్నారు .

- Advertisement -

 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రజనీకాంత్ భయపడుతున్నాడని అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూడా కథనాలు వినిపిస్తున్నాయి . రాజకీయాల్లోకి వచ్చాకా భయపడుతూ పొతే పార్టీ పెట్టడం ఎందుకు ? అని ప్రశ్నిస్తున్నారు . అయితే రాజకీయాల్లోకి రజనీకాంత్ వస్తున్నట్లుగా 20 ఏళ్లుగా ప్రచారం సాగుతూనే ఉంది కానీ అది ఎప్పటికప్పుడు వాయిదాపడుతూనే ఉంది . అయితే 2017 లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు కానీ తీరా ఎన్నికల సమయం రాగానే అసెంబ్లీ ఎన్నికలే మనకు గీటురాయి అంటూ అందరి ఆశలపై నీళ్లు చల్లాడు రజనీకాంత్ .

English Title : Rajinikanth fans upset in election time

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts