Homeటాప్ స్టోరీస్రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ

రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ

రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ
రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ

నటీనటులు: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్, దివ్య నార్ని, రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం తదితరులు
దర్శకత్వం: రవికుమార్ కోలా
నిర్మాణం: మనోవికాస్ & మీడియా9 మనోజ్
సంగీతం: జయ్ కె
రేటింగ్ : 2.75/5

కొన్ని సినిమాలకు తెలియకుండానే ఒక రకమైన పాజిటివిటీ వస్తుంది. ట్రైలర్ వలనో, మరొకటో కానీ ఆ సినిమా బాగుంటుందనే నమ్మకం కలిగిస్తుంది. హీరో పేరు, దర్శకుడి పేరు కూడా తెలియకుండా ఈ సినిమాకి వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రేక్షకులకు అలా అనిపించిన సినిమా రాజా వారు రాణి గారు.

- Advertisement -

కథ:
ఈ సినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. కథ ఏంటనేది ట్రైలర్ లోనే చెప్పేసారు. రాజా (కిరణ్ అబ్బవరం), రాణి (రహస్య గోరఖ్) ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం ధైర్యం సరిపోదు. ఈ నేపథ్యంలో రాజా స్నేహితులు అతనికి సహాయపడుతుంటారు. వాళ్ళు చేసిన సహాయాలేంటి? దాని వల్ల రాజా పడిన ఇబ్బందులేంటి? చివరికి రాజా ప్రపోజ్ చేయగలిగాడా లేదా? రాణి మనసులో ఏముంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూసి తెలుగుకోవాల్సిందే.

నటీనటులు:
ఈ సినిమాలో చాలా మందికి ఇదే మొదటి చిత్రం. హీరో, హీరోయిన్, స్నేహితుల దగ్గరనుండి అందరూ కొత్త ముఖాలే. అయితే ఎవరూ ఇందులో బెరుకుగా నటించింది లేదు. కిరణ్ అబ్బవరం ప్రేమను చెప్పడానికి ఇబ్బందిపడే హీరోగా మెప్పించాడు. అతని హావభావాలు, మాటతీరు అన్నీ నచ్చుతాయి. రహస్య గోరఖ్ పర్వాలేదు. నిజానికి ఈ సినిమాలో ఆమె రోల్ చిన్నదే. అందులోనూ ఆమెకు డైలాగులు తక్కువే. పెర్ఫార్మన్స్ కు పెద్దగా స్కోప్ రాలేదు. రాజా స్నేహితులుగా చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం ఇద్దరూ సినిమాలో కడుపుబ్బా నవ్విస్తారు. ముఖ్యంగా వాళ్ళ నాయుడు, చౌదరి కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది. ఇద్దరూ ఇండస్ట్రీలో ఎక్కువ దూరం ప్రయాణించగలరు అనిపిస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నట్లు మిగిలిన అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం:
అవ్వడానికి చిన్న సినిమానే అయినా రాజా వారు రాణి గారు సాంకేతికంగా ఉన్నతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి అందాలని సినిమాటోగ్రాఫర్ బంధించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం కూడా సినిమాటోగ్రఫీ క్లాస్ గా అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా బాగుంది. ఒక ఫ్రెష్ ఫీల్ ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

ఇందాకే చెప్పుకున్నట్లు ఈ సినిమా స్టోరీ చాలా పల్చగా ఉంది. సింగిల్ లైన్ కూడా పట్టనంత చిన్న స్టోరీ. దీనిని ఒక షార్ట్ ఫిల్మ్ గా తీసి ఉంటే మంచి అప్లాజ్ వచ్చి ఉండేదేమో. ఏదేమైనా దర్శకుడిగా రవికుమార్ కోలా మెప్పిస్తాడు. ఇంత చిన్న స్టోరీని కూడా ఎఫెక్టివ్ గా చెప్పడంలో చాలా మటుకు సక్సెస్.అయ్యాడు.

చివరిగా:
సింగిల్ పాయింట్ కూడా పట్టని ఒక కథను సినిమాగా తీయాలనుకోవడం సాహసమే. అయితే దర్శకుడు రవికుమార్ కోలా అందరిలానే ఇలాంటి సందర్భంలో ఎంటర్టైన్మెంట్ మీద ఆధారపడ్డారు. సినిమా ఈ విషయంలో పూర్తి సంతృప్తినిస్తుంది. హీరో స్నేహితులు ఇద్దరూ పంచిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. చౌదరి, నాయుడు అంటూ వచ్చే ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. సినిమా అంతా లైటర్ వేన్ లో సాగిపోవడం పెద్ద ప్లస్. మొత్తంగా చూసుకుంటే కథ చాలా చిన్నది, సినిమా చాలా స్లో గా ఉంటుంది అన్న కంప్లైంట్స్ తప్ప సినిమాలో ఎంచడానికి పెద్ద మైనస్ పాయింట్స్ లేవు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All