Homeటాప్ స్టోరీస్ప్లాప్ డైరెక్టర్ తో రాజశేఖర్.. ప్లాన్ రెడీ!

ప్లాప్ డైరెక్టర్ తో రాజశేఖర్.. ప్లాన్ రెడీ!

Rajashekhar movie with director verabhadram chowdary

టాలీవుడ్ యాంగ్రీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథనాయకుడు రాజశేఖర్. ఎన్నో అపజయాల తరువాత గారుడవేగ సినిమాతో కాస్త కదురుకున్నట్టు అనిపించిన రాజశేఖర్ ఎన్నో రోజులు ఆ సక్సెస్ ని నిలబెట్టుకోలేకపొయారు. ఉహించని విదంగా కల్కి సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్న ఈ యాక్టర్ ఈ సారి ఎలాగైనా మరో సక్సెస్ తో సెట్టవ్వలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

గత కొన్ని వారాల క్రితం ఒక కన్నడ రీమేక్ సినిమా చేయాలని అనుకున్నప్పటికీ స్క్రిప్ట్ డెవలప్ చేసిన తరువాత దర్శకుడితో కాస్త విబేధాలు రావాదంతో ఆ రీమేక్ కి నో చెప్పేశాడు. గ్యాప్ రావద్దని ఫైనల్ గా మరో సినిమా స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా నా పెళ్ళంట – పూల రంగడు వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వీరభద్ర చౌదరి చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్ ఈ దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు అంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి.
ఎందుకంటే వీరభద్ర చౌదరి చివరి రెండు సినిమాలు భాయ్ – చుట్టాలబ్బాయి నిర్మాతలను దారుణంగా దెబ్బకొట్టాయి. ఆ సినిమాల ఫెయిల్యూర్స్ తో అతనికి మళ్ళీ అవకాశాలు రాలేవు. మొత్తానికి రాజశేఖర్ కి స్క్రిప్ట్ వినిపించి ఒకే చేయించుకున్నాడు అంటే దర్శకుడు స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 15నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టాలని ప్లాన్ రెడీ చేసుకున్నారు. మరి ఈ సినిమాతో రాజశేఖర్ ఎంతవరకు సక్సెస్ అంసుకుంటాడో చూడాలి.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All