Homeటాప్ స్టోరీస్ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయ‌కండి : ‌శివాత్మిక‌

ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయ‌కండి : ‌శివాత్మిక‌

ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయ‌కండి : ‌శివాత్మిక‌
ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయ‌కండి : ‌శివాత్మిక‌

ప్ర‌పంచాన్ని కోవిడ్ మ‌హ‌మ్మారి అత‌లాకుత‌లం చేస్తోంది. ఎక్క‌డ ఏ న్యూస్ చూసినా విన్నా క‌రోనా కేసులే.  ప్ర‌పంచం మొత్తం ఒక్క‌సారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా క‌రోనా భ‌య‌పెట్టేస్తోంది. ఏ చిన్న జ్వ‌రం సింమ్ట‌మ్స్ క‌నిపించినా క‌రోనానే అనేంతగా ప్ర‌తీ ఒక్క‌రు భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

టాలీవుడ్‌లో ఈ మ‌ధ్య క‌రోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముందుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో బండ్ల గ‌ణేష్ నుంచి క‌రోనా బారిన ప‌డిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది. ఆ త‌రువాత రాజ‌మౌళి, కీర‌వాణి ఫ్యామిలీ, స‌మ్రాట్ సోద‌రి శిల్పారెడ్డి, నిర్మాత డీవీవీ దాన‌య్య వంటి వారు క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. తాజాగా హీరో రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ క‌రోనా బారిన ప‌డింది.

- Advertisement -

ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. త‌న పిల్ల‌లు కోలుకున్నార‌ని, త‌ను, జీవిత ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నామ‌న్నారు. అయితే తాజాగా రాజ‌శేఖ‌ర్ పెద్ద‌కుమార్తె శివాత్మిక సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ రాంగ్ ఇండికేష‌న్స్‌ని అందించింది. ‌ప్రియ‌మైన అంద‌రికి .. కోవిడ్‌తో నాన్న తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. మీ ప్రార్థ‌న‌లు, ప్రేమాభిమానాల వ‌ల్లే మేము కోలుకున్నామ‌ని భావిస్తున్నాను. నాన్న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను. ఆయ‌న క్షేమంగా తిరిగి రావాల‌ని మీరంతా ప్రార్థించండి` అని ట్వీట్ చేసింది. పాజిటివ్‌గా వెళ్లాల్సిన ఈ ట్వీట్ రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం విష‌మం అంటూ ప్ర‌చారం చేసేదాకా వెళ్లింది. మ‌రోసారి దీనిపై స్పందించిన శివాత్మిక నాన్న కోలుకుంటున్నారు. ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా వుందంటూ ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయ‌కండి అంటూ స్ప‌ష్టం చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All