Homeటాప్ స్టోరీస్అభిమానులు మీరు ఇలా చేస్తే ఎలా?

అభిమానులు మీరు ఇలా చేస్తే ఎలా?

అభిమానులు మీరు ఇలా చేస్తే ఎలా?
అభిమానులు మీరు ఇలా చేస్తే ఎలా?

ఇప్పుడు సినిమాలు చూసుకుంటే ఒక్క సినిమా హిట్ అయితే ఆ హీరోకి వేల, లక్షల్లో అభిమానులు పుట్టుకొస్తున్నారు రాత్రికి రాత్రి. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగానే ఒక్క రోజుల్లోనే హీరో కి అభిమానులు పుట్టుకొస్తున్న ఈ 2020 యుగంలో పాత కథానాయకుల పరిస్థితి ఇంకా బాగుండేది. ఎందుకంటే అప్పట్లో నాటకాలే ముందు కనుక నాటకాలు చేసే వారికి కూడా అభిమానులు ఉండేవారు.

నాటకాలు తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చాయి. ఆ కాలంలో మహా మహా నటులు ఉన్నారు. మన తెలుగులో తారక రామ రావు, నాగేశ్వర రావు గారు లాగానే తమిళంలో శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్ లాంటి వాళ్ళకి అభిమానులు వారి సినిమాలకి ప్రాణాలు పెట్టేసేవారు. తర్వాత తరంలో తమిళంలో అడుగుపెట్టిన నటుల్లో ‘రజినీకాంత్‘ గారు గొప్ప పేరుని సంపాదించుకున్నారు. ఒక్క సినిమా అని కాదు చేసే ప్రతి సినిమాలో జనాలకి నచ్చుతుందా? నన్ను ఇలా చూడగలరా? అని ఒక్క మాట దర్శకులని అడిగిన తర్వాత చేసేవారు అంటా. అలా ఒకొక్క అడుగు ముందుకి వేసుకుంటూ అపజయాలు వచ్చినా వెనుక అడుగు వెయ్యకుండా కష్టమో, నష్టమో నాకు అభిమానులు ముఖ్యం నా సినిమాల నిర్మాతలే నాకు ముఖ్యం అని ధీమాగా ఉండేవారు.

- Advertisement -

అలా ఉన్నారు కనుకే ఆయనకీ అభిమానులు మన ఇండియా మొత్తంలో అడుగడుగునా ఉన్నారు. బయట ప్రపంచానికి కూడా రజినీకాంత్ గారి గొప్పతనం తెలుసు. అలాంటిది రజినీకాంత్ గారు షూటింగ్ సమయంలో కాకుండా బయట కనిపిస్తే ఊరుకుంటారా? అలాంటి సన్నివేశం ఒకటి జరిగింది చెన్నై లో…..రజనీకాంత్ గారు 10 రోజుల ముందు ‘దర్బార్’ సినిమా ముగించుకొని హిమాలయాల పర్యటనకి వెళ్లారు. తిరిగి చెన్నై తన నివాసానికి వస్తున్నారు అని తెలుసుకున్న అభిమానులు విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చారు.

అక్కడ కొంతమందిని పరామర్శించి తన వాహనంలో ఇంటికి బయలు దేరారు రజనీకాంత్ గారు. అది గమనించిన ఒక పిచ్చి అభిమాని రజినీకాంత్ గారి కారుని అనుసరిస్తూ వెనకాల తన బండి మీద ఇంటి దాకా వెళ్లారు. కారు దిగిన తర్వాత రజినీకాంత్ గారు ఆ అభిమానిని ఇంటి లోపలి పిలిచి కూర్చోమని చెప్పి ఒక చిన్న హెచ్చరిక ఇచ్చారు. ‘మీరు నా అభిమానులు..నన్ను చూసి మీరు ఇలా పగలు రాత్రి తేడా లేకుండా నను అనుసరిస్తూ దారి మధ్యలో మీకేమైనా అయితే మొదట నేనే బాధ పడేవాడిని…ఇలా చెయ్యడం నాకు ఏ మాత్రం నచ్చదు.. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు’
అని చెప్పి కొంత హెచ్చరించిన తర్వాత ఒక ఫోటో కూడా దిగారు ఆ అభిమానితో.

అసలు అభిమాని కొరికే అది కదా అని విషయం తెలుసుకున్న వారు అనుకున్నారు. మరి అలా అనుసరిస్తే ఫోటో ఇచ్చినందుకు మిగిలిన పిచ్చి అభిమానులు ఊరుకుంటారా? అసలే అక్కడ రజినీకాంత్ గారు…ఒకవేళ మందలించినా కూడా అభిమానులకి ఎం కావాలో ఏమి ఇవ్వాలో తెలిసిన మంచి మనిషి. చూద్దాం మరి ముందు ముందు తమిళ తంబీలు ఇంకా ఎలాంటి వింతలు చేస్తారో?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All