Homeగాసిప్స్రజనీకాంత్ దర్బార్ కథ ఇదేనా.?

రజనీకాంత్ దర్బార్ కథ ఇదేనా.?

రజనీకాంత్ దర్బార్ కథ ఇదేనా.?
రజనీకాంత్ దర్బార్ కథ ఇదేనా.?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా దర్బార్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సుమారు 27 ఏళ్ళ తరువాత, రజనీకాంత్ మళ్ళీ పోలీసు క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఆదిత్య అరుణాచలం ముంబై పోలిస్ కమీషనర్ అంటూ, ట్రైలర్ లో అదరగొట్టాడు. ఇక దుమ్ము .. ధూళి సాంగ్ విజువల్స్ లో రజనీ ఎనర్జీ, చూసి ఫ్యాన్స్ తోపాటు సినీ ఆడియెన్స్ కూడా మంత్రముగ్దులైపోయారు.

ఇక దర్బార్ కథ విషయానికి వస్తే, హీరో ఒక పోలిస్ అధికారిగా ఉండటం, ఎదో కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్న సమయంలో, అనుకోకుండా ఒక పెద్ద స్కామ్ కి సంబంధించిన సమాచారం లభించడం, దాన్ని పట్టుకుని ఇంకా లోతుగా వెళితే దాంట్లో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో పాటు, పోలిస్ వారు కూడా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో హీరో కి విలన్ కి డైరెక్ట్ గా జరిగిన డిస్కషన్ అనేది దగ్గర ఇంటర్వెల్ పడితే, అక్కడ దానికి సంబంధించి ఒక అనుకోని ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇంతకు హీరో నిజంగా హీరోనా.? లేక దొంగా.?

- Advertisement -

ఒకవేళ దొంగ అయితే మారువేషంలో పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చాడు.? సెకండాఫ్ లో హీరో కి క ఫ్లాష్ బ్యాక్ అందులో హీరోయిన్ మరియు విలన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్,అక్కడే ఫస్ట్ హీరోకి, విలన్ కి యుద్ధం మొదలు. ఇప్పుడు క్లైమాక్స్ కి హీరో విలన్ పై గెలిచినా అతన్ని సొసైటీ విలన్ అని అనే పరిస్థితి ఉంటె, అతని ద బ్యాడ్ పర్సన్ గా మిగిలిపోతాడా .? ఇది బేసిక్ స్టోరీ. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు, హాలీవుడ్ లో డిపార్టెడ్ & ఫేస్ ఆఫ్ అని రెండు సినిమాలు ఇప్పటికీ అందరి ఆల్ టైం ఫేవరేట్. ఇక రజనీ మ్యాజిక్ కి మురుగదాస్ టేకింగ్ కలిస్తే దర్బార్ కూడా ఒక బెస్ట్ కాప్ మూవీ అవుతుంది అని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All