
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తొలిసారి కలిసి నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుందంటూ చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్ చిన్ననాటి సన్నివేశాలని చైల్ట్ ఆర్టిస్ట్‌పై చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ పెదవి విరిచిన విషయం తెలిసిందే. తను నిర్మిస్తున్న `మైదాన్` చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు తాను చాలా రోజుల క్రితమే ప్రకటించానని .. ఇది అన్యాయమని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అయితే దీనిపై ఇంత వరకు రాజమౌళి ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదే సందర్భంగా బోనీ కపూర్ `బాహుబలి`లో శ్రీదేవి ఎందుకు చేయలేకపోయిందో వెల్లడించడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. శ్రీదేవి లాంటి బిగ్ స్టార్‌కు `బాహుబలి` స్క్రిప్ట్ నచ్చిందని, తను కూడా కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చిందని.. అవి చాలా గ్రేట్ అని రాజమౌళి తనకు మెసేజ్ కూడా చేశాడని చెప్పుకొచ్చారు. కానీ స్టార్ లాంటి శ్రీదేవిని తక్కువ పారితోషికానికి ఆ పాత్ర చేయమని అడిగితే ఎలా చేస్తుంది. అందుకే చేయలేదు. దానికి రాజమౌళి పెడర్థాలు తీశారు` అని పాత సంగతుల్ని ఇప్పుడు బయటికి చెప్పడం ఏంటని అంతా విస్తూ పోతున్నారు. కానీ బోనీ ఎంతగా పాత సంగతుల్ని బయటిపెట్టినా రాజమౌళి మాత్రం మౌనంగానే వుండటం విశేషం.