Homeటాప్ స్టోరీస్తెలుగు రాష్ట్రాల సీఎంలకు రాజమౌళి థాంక్స్

తెలుగు రాష్ట్రాల సీఎంలకు రాజమౌళి థాంక్స్

rajamouli thanks to telguu cms
rajamouli thanks to telguu cms

ఏపీలో టికెట్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో ను సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణ లోను ఐదో షో కు పర్మిషన్ ఇస్తూ..పెద్ద సినిమాలు వేసుకోవచ్చని తెలుపడం తో చిత్ర సీమా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు థాంక్స్ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాల రిలీజ్ టైం లో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడం పట్ల ఏపీ సర్కార్ ఫై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిత్రసీమలో పలువురు సోషల్ మీడియా ద్వారా థాంక్స్ చెప్పుకోగా..తాజాగా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్ ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు , మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు, మాకు నిరంతరం మద్దతు ఇచ్చారిన.. ఇది సినీ పరిశ్రమకు పెద్ద ఊరట అని ఆయన ట్విట్ చేశారు. కొత్త జీవో ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు రాజమౌళి. ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నానని ట్విట్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All