Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ చరణ్ లకోసం బాలీవుడ్ హీరోయిన్లు

ఎన్టీఆర్ చరణ్ లకోసం బాలీవుడ్ హీరోయిన్లు

Rajamouli searching bollywood heroines for NTR and Charanఎన్టీఆర్ , చరణ్ ల కోసం బాలీవుడ్ హీరోయిన్ లను వెతికే పనిలో ఉన్నాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఈ ” ఆర్ ఆర్ ఆర్ ” . తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ లుగా బాలీవుడ్ భామలను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట జక్కన్న . ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఇద్దరిని ఎంపిక చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

వీరితో పాటుగా దక్షిణాది కి చెందిన ఇద్దరినీ కూడా పరిశీలిస్తున్నాడు రాజమౌళి . ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది . ఇక ఈనెలలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది . ఎన్టీఆర్ చరణ్ లు హీరోలు కావడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి . ఎన్టీఆర్ తో రాజమౌళి మూడు సినిమాలు చేయగా చరణ్ తో మగధీర సినిమా చేసాడు రాజమౌళి . ఇక ఇప్పుడేమో ఇద్దరినీ కలిపి ఈ సినిమా చేస్తున్నాడు . 2020 లో ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం విడుదల కానుంది .

- Advertisement -

English Title: Rajamouli searching bollywood heroines for NTR and Charan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All