Homeగాసిప్స్ఎన్టీఆర్‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్నారా?

ఎన్టీఆర్‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్నారా?

ఎన్టీఆర్‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్నారా?
ఎన్టీఆర్‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్నారా?

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ప్ర‌పంచం క‌త్తి ప‌ట్ట‌కుండా, గ‌న్ను పేల్చ‌కుండా నిర్భంద యుద్ధం చేస్తోంది. ఈ స‌మ‌యంలో లాక్ డౌన్ విధించ‌డంతో అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో కొంత మంది లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది ఇష్ట‌మైన ప‌నుల్లో బిజీ అయిపోయారు. .

ఒక్కో సెల‌బ్రిటీ ఒక్కో వ్యాప‌కంతో బిజీగా క్వారెంటైన్ టైమ్‌ని గ‌డిపేస్తుంటే జ‌క్క‌న్న మాత్రం ఎన్టీఆర్ కోసం స‌ప్‌ప్రైజ్‌ని రెడీ చేస్తున్నార‌ట‌. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల క‌ల‌యిక‌లో రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. డీవీవీ దాన‌య్య అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జ‌న‌వరి 8న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేసి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన జ‌క్క‌న్న మే 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కొమ‌రం భీం పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నాడ‌ట‌. 37 రోజులు వుండ‌టంతో ఎన్టీఆర్ లుక్ కొమ‌రం భీంగా ఎలా వుండ‌బోతోంది? జ‌క్క‌న్న ఎలా చూపించ‌బోతున్నాడ‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All