
రామ్‌గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా ఫ్రీ పబ్లిసిటీని పక్కాగా ప్లాన్ చేసుకుంటుటాడు. దాంతో అతని ప్రమేయం లేకుండా సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంటుంది. రాజమౌళి కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన `రామరాజు ఫర్ భీం` టీజర్‌ని రిలీజ్ చేశారు. టీజర్‌లో భీం పాత్రని ఎలివేట్ చేసిన తీరు రామ్‌చరణ్ ఫ్యాన్స్ కి ఈర్ష కలిగించింది. రామరాజు టీజర్‌తో పోలిస్తే ఎన్టీఆర్ టీజమ్ లప్ టు ద మార్క్ లెవెల్లో వుంది. స్టన్నింగ్ విజువల్స్, రొమాంచితమైన సన్నివేశాలు.. ఎన్టీఆర్ పులితో ఫైట్.. ఆ తరువాత చేసే భీకర రోరింగ్.. వెరసి రామరాజు ఫర్ భీం ఓ టెర్రిఫిక్ ట్రీట్‌లా వుందన్న ప్రశంసలు వినిపించాయి.
అయితే అదే రేంజ్‌లో టీజర్ చివర్లో ఎన్టీఆర్ ముస్లీమ్ టోపీ పెట్టుకుని కనిపించిన సన్నివేశంపై విముర్శలు హెచ్చరికలు వెల్లవెత్తుతున్నాయి. ఆదివాసీ ముద్దు బిడ్డని అవమానించారంటూ సాక్ష్యాత్తు బీజేపీ ఎంపీ సోయం బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లని తగుల బెడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలపై రాజమౌళి మాత్రం పెదవి విప్పడం లేదు. ఎంత వివాదం అయితే అంతమంచిదని రాజమౌళి భావిస్తున్నారా?.. ఎందుకు స్పందించడం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.