
ఎస్ ఎస్ రాజమౌళి ముంబైలో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ను కలిశారు. ముంబై ఫిల్మ్ సిటీలో సల్మాన్ ఖాన్ షూటింగ్ స్పాట్ లో ఉండగా రాజమౌళి ఆయన్ను అక్కడే కలిశారు. రాజమౌళితో పాటు ఆయన కొడుకు కార్తికేయ కూడా ఉన్నారు. దీనిపై బాలీవుడ్ మీడియా భిన్న కథనాలను ప్రచురిస్తోంది. రాజమౌళి, సల్మాన్ ను మర్యాదపూర్వకంగా కలవడానికి కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఎవరి ఊహలు వారు చేసుకుంటున్నారు.
అయితే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు సల్మాన్ ను ఆహ్వానించడానికి రాజమౌళి స్వయంగా కలిసినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి భారీ హైప్ అవసరం. అందుకోసమే సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్ కు వస్తే బాగుంటుంది అన్నది వారి ప్లాన్.
సల్మాన్ ఖాన్ కు రామ్ చరణ్ తో మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ స్పెషల్ పాత్రను పోషిస్తోన్న విషయం తెల్సిందే. ఇక ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ ప్రముఖ పాత్రలను పోషించారు. జనవరి 7, 2022న ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతోంది.
ఇవి కూడా చదవండి:
సల్మాన్ ఖాన్ కి దర్శకుడు కావలెను
మాస్టర్ హిందీ రీమేక్ కు రెడీ అయిన సల్మాన్ ఖాన్
సుశాంత్ అభిమానుల తిట్లను పట్టించుకోకండి : సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ సినిమా అంటే అంత విజీ కాదు