Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Rajamouli comments to ntr
Rajamouli comments to ntr

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ..రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక ఈ మూవీ లో చరణ్, ఎన్టీఆర్ ల పాత్రల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇద్దరు కూడా అద్భుతంగా నటించి మెప్పించారు. కాగా సోషల్ మీడియా లో గత కొద్దీ రోజులుగా ఎన్టీఆర్ , చరణ్ అభిమానుల మధ్య ఓ చర్చ నడుస్తుంది. మా హీరో బాగా చేసాడంటే..మా హీరో బాగా చేసాడని కామెంట్స్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో రాజమౌళి తాజాగా ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేయడం .మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. `కొమురం భీముడో సాంగ్ ట్రిపుల్ ఆర్ లో వున్న ప్రధాన ఘట్టాల్లో కీలకమైనది. ఈ పాటలో ఎన్టీఆర్ పలికించిన హవభావాలు ఇండియా వైడ్ గా వున్న ఏ స్టార్ నటుడు పలికించలేడు. ఎమోషన్ని పెయిన్ ని అన్నింటినీ ఒకే షాట్ లో ప్రదర్శించి నటుడిగా తానేంటో మరో సారి నిరూపించాడు. ఇది అతని నటనకు ప్రతి రూపం` అంటూ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశాడు రాజమౌళి. ఆయన తాజా వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వైరల్ గా షేర్ చేస్తుండటం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All