
ప్రభాస్ – రాజమౌళి మధ్య స్నేహ బంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ లో ప్రభాస్ చాల తక్కువ మందితో క్లోజ్ గా ఉంటారు. ఆ కొద్దీ మందిలో రాజమౌళి ఒకరు. రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి , బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో బిజీ గా ఉంటె, ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నారు. తాజాగా రాధే శ్యామ్ చిత్రానికి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చి తన ప్రేమను పంచుకున్నారు. అంతే కాదు తాజాగా ప్రభాస్‌తో కలిసి రాజమౌళి ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వూలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ , ప్రశ్నలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రాజమౌళి తో ఉన్న సాన్నిహిత్యంతో ప్రభాస్ నేరుగా ఆయన్ను ఓ ప్రశ్న అడిగారు. రాధేశ్యామ్ సినిమాను మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారనే ప్రశ్న వేశారు. దీనిపై రాజమౌళి రియాక్ట్ అవుతూ.. నువ్వు నా డార్లింగ్, నీకోసం ఏదైనా చేస్తానని అనేశారు. ఈ సమాధానంతో ప్రభాస్- రాజమౌళి బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది మరోసారి స్పష్టమైంది. రాజమౌళి చెప్పిన ఈ సమాధానం తో ప్రభాస్ మాత్రమే కాదు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఇక రాధే శ్యామ్ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.