
గత ఏడు నెలలుగా ఆగిపోయిన `ఆర్ఆర్ఆర్`షూట్ మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరమం భీంగా, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదరుచూసిన అభిమానులకు ఎట్టకేలకు రాజమౌళి శుభవార్త వినిపించారు.
`జీవితం ఇప్పటికే కొత్త కోణంలో సాధారణంగా మారిపోయింది. దానికి అనుగుణంగా మనం ముందుకు సాగాలి. కాబట్టి మా షూట్ ను తిరిగి ప్రారంభిస్తున్నాం` అని రాజమౌళి ట్వీట్ చేస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోని నెటిజన్స్‌తో మంగళవారం పంచుకున్నారు. `ఆర్ఆర్ఆర్` సెట్స్‌లోకి తిరిగి రావడం చాలా బాగుంది. నా ప్రియమైన సోదరుడు తారక్ కోసం ఒకటి సిద్ధమవుతోంది. మీకు వాగ్దానం చేసినట్లుగా ఈ నెల 22న ఉత్తమమైన దాన్ని అందించబోతున్నాం` అని హీరో రామ్‌చరణ్ ట్వీట్ చేశారు.
రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు లుక్ టీజర్‌ని రాజమౌళి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్‌డేకు కూడా అలాంటి సర్‌ప్రైజ్‌నే అందిస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదరుచూశారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేయలేకపోతున్నామని జక్కన్న ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. వారి కోసం ఈ నెల 22న ఎన్టీఆర్‌కు సంబంధించిన భీమ్ లుక్ టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Life has already become a new normal. We have to adapt to it and move on. And so our shoot resumes… 🙂https://t.co/qFlpsIHJpc
Await #RamarajuforBheemOnOct22.. #WeRRRBack.
— rajamouli ss (@ssrajamouli) October 6, 2020
