HomeVideosరాజా విక్రమార్క ట్రైలర్: సస్పెన్స్ తో కూడిన ఎంటర్టైన్మెంట్

రాజా విక్రమార్క ట్రైలర్: సస్పెన్స్ తో కూడిన ఎంటర్టైన్మెంట్

రాజా విక్రమార్క ట్రైలర్: సస్పెన్స్ తో కూడిన ఎంటర్టైన్మెంట్
రాజా విక్రమార్క ట్రైలర్: సస్పెన్స్ తో కూడిన ఎంటర్టైన్మెంట్

హీరో కార్తికేయ తన కెరీర్ ను విభిన్నంగా ముందుకు తీసుకెళుతున్నాడు. హీరోగా చేస్తూనే విలన్ వేషాలతో కూడా రాణిస్తున్నాడు. అయితే హీరోగా కార్తికేయ సినిమాలు ఈ మధ్య కాలంలో అనుకున్నంతగా ఆడలేదు. అయినా కానీ కార్తికేయ నుండి ఎగ్జైటింగ్ అనిపించదగ్గ చిత్రాలు వస్తున్నాయి. అలాంటి ఒక చిత్రమే ఈ రాజా విక్రమార్క. స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ గా కార్తికేయ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. నవంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈరోజు ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద కచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. అటు కేసులు సాల్వ్ చేస్తూనే ఇటు అమాయకంగా కనిపించే కుర్రాడిగా కార్తికేయ నటిస్తున్నాడు. కామెడీ, సస్పెన్స్ ఈ రెండూ ఈ చిత్రంలో ప్రధాన భూమిక పోషిస్తాయని అర్ధమవుతోంది. ట్రైలర్ తో కార్తికేయ ఈసారి హిట్ కొడతాడేమోనని అనిపిస్తోంది.

- Advertisement -

తాను ఇష్టపడ్డ హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ కావడంతో తనను రక్షించే బాధ్యత తీసుకున్న ఒక ఆఫీసర్ కథ ఇదని అర్ధమవుతోంది. కాన్సెప్ట్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. శ్రీ సారిపల్లి డైరెక్ట్ చేసిన రాజా విక్రమార్కను 88 రామ రెడ్డి నిర్మించాడు. తనికెళ్ళ భరణి, హర్ష వర్ధన్ వంటి వారు కీలక పాత్రలు పోషించగా తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించనుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All