
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆరెక్స్ 100తో సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న కార్తికేయ ఆ తర్వాత ప్లాపులను మూటగట్టుకున్నాడు. రీసెంట్ గా కార్తికేయ తన కెరీర్ పరంగా ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటించాడు. అలాగే అజిత్ చిత్రం వాలిమైలో కూడా విలన్ గా చేసాడు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
అయితే హీరోగా కార్తికేయ చేసిన రీసెంట్ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. దీంతో తనకు బ్రేక్ ఇచ్చే విజయం కోసం చూస్తోన్న కార్తికేయ లేటెస్ట్ గా రాజా విక్రమార్క చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక స్పై ఏజెంట్ గా కనిపించనున్నాడు. రాజా విక్రమార్క సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
టీజర్ తో అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేసారు. శ్రీ సారిపల్లి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వివి వినాయక్ వద్ద అసిస్టెంట్ గా చేసాడు శ్రీ. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. రాజా విక్రమార్క ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది.
Super excited & extremely thrilled to announce that our #RajaVikramarka is releasing in theatres on Nov 12th ?
One of the most special roles in my career. Need all your blessings and support ?
#RajaVikramarkaOnNov12 pic.twitter.com/KtqsvEdHrg— Kartikeya (@ActorKartikeya) October 20, 2021