Homeటాప్ స్టోరీస్రాజా విక్రమార్క రివ్యూ

రాజా విక్రమార్క రివ్యూ

రాజా విక్రమార్క రివ్యూ
రాజా విక్రమార్క రివ్యూ

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ లీడ్ రోల్స్ లో నటించిన రాజా విక్రమార్క ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:
రాజా విక్రమార్క (కార్తికేయ) ఒక ఎన్ఐఏ అధికారి, హోమ్ మినిస్టర్ సుకుమార్ (సాయి కుమార్) సెక్యూరిటీ కోసం నియమింపబడతాడు. తన మిషన్ లో ఉండగా హోమ్ మినిస్టర్ కూతురు కాంతి (తాన్యా రవిచంద్రన్) తో ప్రేమలో పడతాడు కానీ ఆ తర్వాత ఆమె కిడ్నప్ కు గురవుతుంది.

- Advertisement -

కాంతిని కిడ్నప్ చేసిందెవరు? వాళ్లకు ఏం కావాలి? హోమ్ మినిస్టర్ కూతుర్ని రాజా విక్రమార్క సేవ్ చేయగలిగాడా లేదా అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

పెర్ఫార్మన్స్:
ఎన్ఐఏ అధికారి పాత్రకు కార్తికేయ సరిగ్గా సరిపోయాడు. ఎనర్జిటిక్ గా నటించాడు. తాన్యా రవిచంద్రన్ చూడటానికి బాగుండటమే కాకుండా [పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. సాయి కుమార్ నిజాయితీ కల హోమ్ మినిస్టర్ పాత్రలో బాగా నటించాడు. తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారు. సుధాకర్ కొమాకులకు ఇంపార్టెంట్ పాత్ర దక్కింది. మిగతా కాస్ట్ కూడా బాగానే చేసారు.

సాంకేతిక నిపుణులు:
ప్రశాంత్ ఆర్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కంటికింపుగా ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ ను తెరకెక్కించిన విధానం నచ్చుతుంది. నిర్మాణ విలువలు కూడా ఓకే.

ఇక దర్శకుడు శ్రీ సారిపల్లి విషయానికొస్తే దర్శకుడిగా యావరేజ్ మార్కులే పడతాయి. రైటింగ్ దశలోనే ఈ సినిమా ఫెయిల్ అయింది. రొటీన్ కథ, స్క్రీన్ ప్లేతో చిత్రం తేలిపోయింది.

చివరిగా:
రాజా విక్రమార్క యావరేజ్ మార్కులే వేయించుకునే ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. కార్తికేయ ఈ సినిమాకు మెయిన్ అసెట్ గా నిలిచాడు.

రేటింగ్: 2.5/5

Also Read:

రాజా విక్రమార్క ట్రైలర్: సస్పెన్స్ తో కూడిన ఎంటర్టైన్మెంట్

కార్తికేయ రాజా విక్రమార్క విడుదల తేదీ ఖరారు

రవితేజ లేకుండానే విక్రమార్కుడు 2?

విక్రమార్కుడు సీక్వెల్ కు స్టేజ్ సెట్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All