
యంగ్ హీరో రాజ్ తరుణ్ `పవర్ ప్లే` వంటి థ్రిల్లర్ తరువాత మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి `స్టాండ్ అప్ రాహుల్` అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. వర్షా బొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది. `కుర్చుంది చాలు` అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరోయిన్ సమంత బుధవారం ఆవిష్కరించారు.
`మైక్ టెస్టింగ్ 1..2..3.. చెక్ చెక్.. రాజ్ తరుణ్ కూర్చుంది చాలు..ఫస్ట్ లుక్, అండ్ టైటిల్ `స్టాండప్ రాహుల్`. ఔట్ స్టాండింగ్ సక్సెస్ టు దిల్ టీమ్` అని సమంత ట్వీట్ చేసింది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హైఫైవ్ పిక్చర్స్ లో నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షార్ట్ , బ్లూకలర్ టీషర్ట్ ధరించి డెస్క్ మీద కూర్చున్న రాజ్ తరుణ్ తీవ్రంగా ఆలోచిస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. అతని టీషర్ట్ పై బఫరింగ్ అవుతున్న సింబల్ అతని క్యారెక్టర్‌ని తెలియజేస్తోంది.
సోమరి అయిన ఓ యువకుడి కథగా ఈ చిత్రాన్ని ఆద్యంద వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రాజ్ తరుణ్ కనిపిస్తున్న తీరు ఈ మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీరాజ్ రవీంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ రాజ్ తరుణ్‌కి మంచి హిట్‌ని అందించేలా వుంది.
Here’s the tTitle & First Look of #StandUpRahul????️
Launched by @Samanthaprabhu2✨
✒️????@mohan_veeranki
????@SweekarAgasthi@sidhu_mudda Presents
????@Nandu_Abbineni @bharath1985 pic.twitter.com/m1dXsA6on4— Raj Tarun (@itsRajTarun) March 24, 2021