Homeటాప్ స్టోరీస్రాజ్ తరుణ్ చిత్రం ఓటిటి వైపు చూస్తోందా?

రాజ్ తరుణ్ చిత్రం ఓటిటి వైపు చూస్తోందా?

రాజ్ తరుణ్ చిత్రం ఓటిటి వైపు చూస్తోందా?
రాజ్ తరుణ్ చిత్రం ఓటిటి వైపు చూస్తోందా?

థియేటర్లు బ్యాన్ చేసి 100 రోజులైంది. ఇన్ని రోజులు దేశంలో థియేటర్లు, మల్టిప్లెక్స్ లు క్లోజ్ అవ్వడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చేమో. ఇప్పటికీ థియేటర్లను ఓపెన్ చేయడానికి అనువైన పరిస్థితులు లేవు. మరో రెండు లేదా మూడు నెలలైనా పట్టే అవకాశముంది. మొదట లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఎవరూ కూడా ఇంత కాలం థియేటర్లు మూతబడతాయని ఊహించివుండరు. అందుకే ఓటిటి సంస్థలు ముందుగా సినిమాను కొనుగోలు చేయడానికి వస్తే ససేమీరా అనేసారు. చిన్న సినిమాలు కూడా గిట్టుబాటు ధర వచ్చినా థియేట్రికల్ రిలీజ్ చేద్దామనే ఎదురుచూశాయి.

అయితే 100 రోజులు గడిచిపోయినా కానీ ఇంకా థియేటర్లు ఓపెన్ అవ్వడంపై ఎటువంటి ప్రకటన లేదు. కనీసం మరో రెండు, మూడు నెలలైనా పట్టే అవకాశముంది. ఎందుకంటే ఇటీవలే షూటింగ్స్ మొదలైనా కానీ కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో మళ్ళీ వాటిని ఆపేసారు. ఆగస్ట్ దాకా ఎటువంటి షూటింగ్స్ మొదలుపెట్టకూడదని ఇటీవలే నిర్మాతలు తీర్మానం చేసుకున్నారు. దీంతో థియేటర్లు కూడా ఆగస్ట్, సెప్టెంబర్ వరకూ తెరుచుకునే అవకాశం లేకుండా పోయింది.

- Advertisement -

మొదటి నుండి ఓటిటి అంటే వద్దనుకున్న చిన్న, మీడియం బడ్జెట్ సినిమా నిర్మాతలు క్రమంగా వాటికి మొగ్గు చూపుతున్నారు. మళ్ళీ ఓటిటి సంస్థలతో టచ్ లోకి వస్తున్నారు.  ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ సినిమా ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చ్ 25న విడుదలవ్వాలి. కానీ కరోనా వల్ల కుదర్లేదు. మరి ఇప్పుడు ఓటిటిలో ఈ సినిమా విడుదలవుతుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All