Homeటాప్ స్టోరీస్అనుభవించు రాజా టైటిల్ సాంగ్ - మినీ సైజ్ ఎంటర్టైన్మెంట్

అనుభవించు రాజా టైటిల్ సాంగ్ – మినీ సైజ్ ఎంటర్టైన్మెంట్

raj taruns anubhavinchu raja title song is entertaining
raj taruns anubhavinchu raja title song is entertaining

వరస ప్లాపులతో ఇబ్బంది పడుతోన్న రాజ్ తరుణ్ తనకు అచొచ్చిన ఎంటర్టైన్మెంట్ జోనర్ కు వచ్చేసాడు. అనుభవించు రాజా టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది. రాజ్ తరుణ్ తో గతంలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చేసిన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. పూర్తిగా కోనసీమ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

టీజర్ తో ఆకర్షించిన అనుభవించు రాజా నుండి టైటిల్ ట్రాక్ విడుదలైంది. ఈ సాంగ్ చిత్రంలో రాజ్ తరుణ్ యొక్క పాత్ర స్వభావాన్ని తెలిపే విధంగా ఉంది. జీవితం ఉన్నది అనుభవించడానికే, ఎప్పుడు ఎటు వెళ్తుందో తెలీని జీవితంలో దాచేసుకుని ఏం చేస్తాం, చివరికి మొలతాడు కూడా నువ్వు పోయాక రాదు అన్న ఫిలాసఫీ హీరోది.

- Advertisement -

దీన్ని పాట రూపంలో భాస్కరభట్ల ఎంటర్టైనింగ్ గా సాహిత్యాన్ని అందించాడు. గోపి సుందర్ మ్యూజిక్ ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. రామ్ మిరియాల తన గొంతులో ఏదో మ్యాజిక్ ఉందని నిరూపించాడు. మొత్తంగా ఈ సాంగ్ ఎంటర్టైనింగ్ గా, సినిమాపై మంచి అంచనాలు రేకెత్తించే విధంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాశీష్ ఖాన్ హీరోయిన్ గా చేస్తుండగా త్వరలోనే ఈ చిత్రం విడుదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All