Homeటాప్ స్టోరీస్రాజ్ త‌రుణ్ క‌ల నెర‌వేరింది!

రాజ్ త‌రుణ్ క‌ల నెర‌వేరింది!

రాజ్ త‌రుణ్ క‌ల నెర‌వేరింది!
రాజ్ త‌రుణ్ క‌ల నెర‌వేరింది!

గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న యంగ్ హీరో రాజ్ త‌రుణ్ `ఒరేయ్ బుజ్జిగా` హిట్‌తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన విష‌యం తెలిసిందే. విజ‌య్‌కుమార్ కొండా ద‌ర్శ‌‌క‌త్వంలో కె.కె. రాధామోహ‌న్  నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో విడుద‌లై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. చాలా కాలం త‌రువాత న‌త‌కు హిట్ ల‌భించ‌డంతో రాజ్ త‌రుణ్ రెట్టించిన ఉత్సాహంతో వున్నారు.

ఇదే జోష్‌లో వున్న ఆయ‌న తాజాగా ఓ ఇంటివాడ‌య్యాడు. హీరోగా ఇటీవ‌లే `ఒరేయ్ బుజ్జిగా` సినిమాతో స‌క్సెస్‌ని త‌న ఖాతాలో వేసుకున్న రామ్ త‌ర‌ణ్ హైద‌రాబా‌ద్‌లో సొంత ఇంటి క‌ల‌ని నెర‌వేర్చుకోవాల‌ని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అది ఇప్ప‌టికి కుదిరింది. గ‌‌త కొంత కాలంగా రాజ్ త‌రుణ్ అద్దె ఇంట్లో వుంటున్నారు. రిసెంట్‌లో ఓ ల‌గ్జ‌రీ ఫ్లాట్‌ని కొనుగోలు చేశాడు.

- Advertisement -

ఇటీవ‌లే అందులో గృహ ప్ర‌వేశం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీలో అత‌నికి అత్యంత స‌న్నిహితులైన వారు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అందులో `ఒరేయ్ బుజ్జిగా` ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా, హీరోయిన్‌, రాజ్ త‌రుణ్ ఫ్రెండ్ అవికా గోర్ హాజ‌ర‌య్యారు. రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తున్నారు. అందులో ఓ మూవీని విజ‌య్ కుమార్ కొండాతో చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All