యువ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో శ్రీను గవిరెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా అనుభవించు రాజా. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ నిర్మించారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా కాశిష్ ఖాన్ నటించింది. సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 26న రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే సాఫ్ వేర్ కంపెనీలో సెక్యురిటీ జాబ్ చేస్తున్న హీరో అక్కడ హీరోయిన్ తో లవ్ లో పడతాడు. ఇక అతని ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఊరిలో ఓ జల్సా చేసే వ్యక్తి అని తెలుస్తుంది. ఊర్లో ఛాలెంజ్ చేసి సిటీకి వచ్చిన రాజా ఏం చేశాడు అన్నది సినిమా కథ. సినిమా ట్రైలర్ చూస్తే కథ కొత్తగా ఏమి లేకపోయినా ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పొచ్చు.
రాజ్ తరుణ్ ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక కెరియర్ లో వెనకపడ్డ రాజ్ తరుణ్ ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కేస్తాడా లేదా అన్నది చూడాలి.
