Homeటాప్ స్టోరీస్`హిట్‌` బాలీవుడ్ రీమేక్‌కి హీరో ఫిక్స్‌!

`హిట్‌` బాలీవుడ్ రీమేక్‌కి హీరో ఫిక్స్‌!

`హిట్‌` బాలీవుడ్ రీమేక్‌కి హీరో ఫిక్స్‌!
`హిట్‌` బాలీవుడ్ రీమేక్‌కి హీరో ఫిక్స్‌!

క్రేజీ హీరో విశ్వ‌క్‌సేన్ హీరోగా నటించిన పోలీస్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్‌`. కొత్త త‌ర‌హా మేకింగ్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని హీరో నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన విష‌యం తెలిసిందే. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా ద‌ర్శ‌కుడికి, హీరో విశ్వ‌క్ సేన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో హిందీలో రీమేక్ చేయ‌బోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఆ వార్త‌ల్ని నిజం చేస్తూ దిల్ రాజు కాంపౌండ్ నుంచి అఫీషియ‌ల్ న్యూస్ ని రిలీజ్ చేశారు. హిట్ ఫ‌స్ట్ కేస్ అనే కాన్సెప్ట్‌తో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగే ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నారు. ఇదే విష‌యాన్ని మంగ‌ళ‌వారం మీడియాకు వెల్ల‌డించారు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ రీమేక్‌లో టాలెంటెడ్ యాక్ట‌ర్ రాజ్ కుమార్ రావు న‌టించ‌నున్నారు.
`హిట్ చూసిన‌ప్పుడే బాగా క‌నెక్ట్ అయిపోయాను. ఇదొక ఎంగేజింగ్ స్టోరీ, ప్ర‌స్తుత ప‌రిస్థితులకు అద్దంప‌ట్టే చిత్ర‌మిది. ఒక న‌టుడిగా ఇలాంటి పాత్ర కోస‌మే ఎదురుచూస్తున్నాను. `హిట్‌`తో ఆ అవ‌కాశం ల‌భించింది. ఈ సినిమా జ‌ర్నీని శైలేష్ కొల‌ను, దిల్ రాజుతో ఎప్పుడు మొద‌లుపెట్టాలా అని ఎదురుచూస్తున్నాను అని రాజ్ కుమార్ రావు తెలిపారు.

- Advertisement -

ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు  శైలేష్ కొల‌ను బాలీవుడ్‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకురానున్నారు. మ‌రో బాలీవుడ్ నిర్మాత కుల్దీప్ రాథోర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.దిల్ రాజు ప్ర‌స్తుతం అల్లు అర‌వింద్‌తో క‌లిసి `జ‌ర్సీ` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All