Homeటాప్ స్టోరీస్`సినిమా బండి` ట్రైల‌ర్ టాక్‌!

`సినిమా బండి` ట్రైల‌ర్ టాక్‌!

Raj and dk Cinema bandi on Netflix
Raj and dk Cinema bandi on Netflix

ఓ ఆటోడ్రైవ‌ర్ కు అనుకోకుండా అత్యంత ఖ‌రీదైన కెమెరా దొరుకుటుంది. ఆ కెమెరాతో తాను త‌న గ్రాంలో త‌న స్నేహితుల‌తో క‌లిసి సినిమా తీయాల‌నుకుంటాడు. కానీ అత‌నికి, అత‌ని స్నేహితుల‌కు సినిమా ఎలా తీయాలో తెలియ‌దు. కానీ ఎన్నో సినిమాలు చూసిన అనుభ‌వం, వారికి దొరికిన కెమెరా సినిమా తీయాల‌నే త‌ప‌న వారి సంక‌ల్పాన్ని ముందుకు తీసుకెళుతుంది. ఈ ప్ర‌యాణంలో ఆ ఆటో డ్రైవ‌ర్ ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌లు, ఆ గ్రామంలో జ‌రిగిన ప‌రిణామాలు వినోదాత్మ‌కంగా వుంటాయి. వారి అమాయ‌క‌త్వం, సినిమా చేయాల‌నే వారి ఆస‌క్తి  చూసే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది` అంటున్నారు ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కంద్రెగుల‌.

ఆయ‌న తెర‌కెక్కిస్తున్న చిత్రం `సినిమా బండి`. `ఫ్యామిలీ మ్యాన్‌`, ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్ట‌ర్స్ రాజ్ అండ్ డీకే డీటు ఆర్ ఇండీ బ్యాన‌ర్‌లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌కుండా ఈ నెల 14న నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు.

- Advertisement -

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో ఉండే ఓ గ్రామం నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది. వారి మ ఆండ‌లికంలో తెలుగు, క‌న్న‌డ భాష‌లు మిళితమై వుంటాయి. వీరు మాట్లాడే భాష‌ను ఇదివ‌ర‌కు ఆడియ‌న్స్ విన‌డం గానీ, చూసిగానీ వుండరు` అన్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All