Homeటాప్ స్టోరీస్ద‌ర్శ‌కేంద్రుడి మాజీ కోడ‌లుకు ఎంగేజ్‌మెంట్‌!

ద‌ర్శ‌కేంద్రుడి మాజీ కోడ‌లుకు ఎంగేజ్‌మెంట్‌!

ద‌ర్శ‌కేంద్రుడి మాజీ కోడ‌లుకు ఎంగేజ్‌మెంట్‌!
ద‌ర్శ‌కేంద్రుడి మాజీ కోడ‌లుకు ఎంగేజ్‌మెంట్‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు క‌నిక థిల్లాన్ కు మ‌రొక‌రితో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. కొన్నేళ్ల క్రితం ర‌చ‌యిత క‌నిక థిల్లాన్‌తో  కె. రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెలమూడి వివాహం జ‌రిగింది. అయితే ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన అభిప్రాయ బేధాల కార‌ణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్ప‌టి నుంచి విడిగానే వుంటున్న క‌నిక థిల్లాన్ తాజాగా త‌ను మ‌రో పార్ట్‌న‌ర్‌ని వెతుక్కున్నారు.

అత‌ను కూడా త‌న‌లాగే రైట‌ర్ కావ‌డంతో ఇద్ద‌రి మ‌న‌సులు క‌లిశాయి. అత‌నే హిమాన్షు శ‌ర్మ‌. `రాంఝానా` చిత్రానికి క‌థ అందించిన హిమాన్షు శ‌ర్మ, క‌నిక థిల్లాన్ పెద్ద‌ల అంగీక‌రాంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ముంబైలో జ‌రిగిన ఈ ఈ వెంట్‌లో ఇరు కుటుంబాల‌కు సంబంధించిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన్నారు. వీరి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

- Advertisement -

`చాలా కాలంగా రిలేష‌న్ షిప్‌లో వున్న తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నామ‌ని, ఈ విష‌యం తెలియ‌జేయ‌డానికి చాలా సంతోషిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్నామ‌ని.. అంద‌మైన జీవితం మా కోసం ఎదురుచూస్తోంద‌ని` క‌నిక‌, హిమాన్ష వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All