Homeటాప్ స్టోరీస్ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి లారెన్స్ సారీ ఎందుకు చెప్పారు?

ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి లారెన్స్ సారీ ఎందుకు చెప్పారు?

ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి లారెన్స్ సారీ ఎందుకు చెప్పారు?
ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి లారెన్స్ సారీ ఎందుకు చెప్పారు?

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్ అండ్ హీరో రాఘ‌వ లారెన్స్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కు సారీ చెప్పారు. ఇంత‌కీ లారెన్స్ త‌లైవా అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు ఎందుకు చెప్పారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల త‌ను రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని, పార్టీని ప్రారంభించ‌డం లేద‌ని సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇటీవ‌ల వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

దీంతో మ‌న‌స్తాపానికి గురైన ర‌జ‌నీ అభిమానులు గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌జ‌నీ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని, రాజ‌కీయాల్లోకి రావాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవ‌ల చెన్నైలో ధ‌ర్నా చేయ‌డంతో ర‌జ‌నీ మ‌న‌స్తాపానికి గురై త‌న‌ని అర్థం చేసుకోండ‌ని, త‌న‌ని ఈ విష‌యంలో బాధ‌పెట్టొద్దంటూ ఓ లేఖ‌ని విడుద‌ల చేయ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ విష‌యంలో ర‌జ‌నీని ఒప్పించాల‌ని కోరుతూ ర‌జ‌నీ అభిమానులు లారెన్స్‌కి ట్వీట్ల‌తో విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -

ఈ ట్వీట్ల‌పై తాజాగా లారెన్స్ స్పందించారు. త‌లైవా నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతూ చాలా మంది నాకు మెసేజ్‌లు, ట్వీట్‌లు చేస్తున్నారు. వారంద‌రికీ స‌మాధానం చెప్ప‌డం కోస‌మే ఈ ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేస్తున్నాను. ర‌జ‌నీ నిర్ణ‌యంతో మీరు ఎలాంటి బాధ‌ని అనుభ‌విస్తున్నారో నేనూ అదే బాధ‌ని అనుభ‌విస్తున్నాను. త‌లైవా రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డానికి మ‌రేదైనా కార‌ణం చెప్పివుంటే ఆయ‌న‌ని త‌న మ‌న‌సు మార్చుకోమ‌ని చెప్పొచ్చు. ఆయ‌న చెప్పిన ప్ర‌ధాన కార‌ణం ఆరోగ్యం. మ‌న వ‌ల్ల ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుని మ‌ళ్లీ అనారోగ్యానికి గురైతే మ‌నం జీవితాంతం సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సి వుంటుంది. రాజ‌కీయాల్లో ఆయ‌న అడుగుపెట్ట‌న‌ప్ప‌టికీ ఆయ‌న నాకు గురువే. కాబ‌ట్టీ ఆయ‌న ఎప్పుడూ ఆయురారోగ్యాల‌తో క్షేమంగా వుండాల‌ని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All